అయ్యన్నపాత్రుడు ఓ సైకో, శాడిస్టు.. విరుచుకుపడిన పూరీ జగన్నాథ్ సోదరుడు

  • ఇటీవల అయ్యన్న ప్రెస్ మీట్
  • సీఎం జగన్, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు
  • అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోవాలన్న పెట్ల ఉమాశంకర్ గణేశ్
  • అయ్యన్న కంటే ఎక్కువ బూతులు మాట్లాడగలమన్న వైసీపీ ఎమ్మెల్యే
సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు, వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'ఏరా అయ్యన్నపాత్రుడూ' అంటూ నిప్పులు చెరిగారు. అయ్యన్నపాత్రుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

అయ్యన్న కంటే తాము ఎక్కువ బూతులే మాట్లాడగలమని అన్నారు. చంద్రబాబును మేం బూతులు తిట్టలేమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అయ్యన్నపాత్రుడు ఓ సైకో, శాడిస్టు అని ఉమాశంకర్ గణేశ్ విమర్శించారు. 

నర్సీపట్నంను గంజాయి అడ్డాగా మార్చింది ఎవరు... అయ్యన్న కాదా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో అయ్యన్న అన్ని పార్టీల నేతల ఇళ్లకు తిరుగుతున్నాడని ఉమాశంకర్ గణేశ్ ఎద్దేవా చేశారు. ఎంతమంది చంద్రబాబులు, అయ్యన్నపాత్రులు వచ్చినా జగన్ ను ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. పొత్తులు లేకుండా, 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం టీడీపీకి, చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఉమాశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.  

Petla Uma Sankar Ganesh
Ayyanna Patrudu
Jagan
YSRCP
Chandrababu
Nara Lokesh
TDP

More Telugu News